రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిశారు ప్రధాని మోడీ. పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ విషయంపై రామ్ నాథ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ఇది చాలా సీరియస్ అంశమని మోడీతో రాష్ట్రపతి చెప్పారు. ఫిరోజ్ పూర్ లో బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్లిన మోడీ కాన్వాయ్ ను రైతులు అడ్డుకున్నారు. దీంతో ప్రధాని ఫ్లై ఓవర్ పై 20 నిమిషాల పాటు నిలిచిపోయారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు పంజాబ్ ప్రభుత్వం ఇద్దరు సభ్యుల ప్యానల్ ను ఏర్పాటు చేసింది. అటు దీనిపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ కూడా జరగనుంది.
మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ అంశంపై మోడీతో ఫోన్ లో మాట్లాడారు. భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా భద్రతా చర్యలపై పటిష్ట చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు.