ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సోషల్ మీడియా ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇళ్లు లేని ఓ మసలమ్మ వీడియోను పోస్ట్ చేసి ”దేశమంతా కరోనా వైరస్ పై యుద్ధం చేస్తుంది..ఈ అమ్మ సెంటిమెంట్ ను గౌరవించి ఇంటి దగ్గరే ఉందాం..ఆమె మనకు సందేశమిస్తుంది” అని హిందీలో ట్వీట్ చేశారు.
నిర్మాణంలో ఉన్న ఓ గుడిసె ముందు కూర్చున్న ముసలమ్మ ప్లేట్ ను కొడుతున్న 11 సెకన్ల ఈ వీడియో క్లిప్ ను ప్రధాని షేర్ చేశారు. ఇది మొన్న ఆదివారం దేశమంతా జనతా కర్ఫ్యూ పాటించి ఇళ్లకే పరిమితమైన రోజు నాటిది. సాయంత్రం ఐదు గంటలకు అందరు కరోనా వైరస్ నియంత్రణకు పాటుపడుతున్న అత్యవసర సేవల ఉద్యోగులకు చప్పట్లు, గంటలు, ప్లేట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ముసలమ్మ కూడా తన గుడిసె ముందు కూర్చొని ప్లేటును కొడుతుండగా పార్ధూ అనే స్థానికుడు తన మొబైల్ ఫోన్ లో వీడియో తీశాడు.
ఈ వీడియో వైరలై ప్రధాని దాకా చేరింది. వీడియో వైరల్ కావడంతో ముసలమ్మకు సహాయం చేయడానికి చాలా మంది పార్ధూకు ఫోన్లు చేస్తున్నారు.