హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల, రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఉమ్మడి సమావేశాన్ని నేడు న్యూఢిల్లిలోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించనున్నారు. ఈ సమావేశాన్ని ప్రధాని మోడీ నేడు ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు సీజేఐ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజులు కూడా సమావేశంలో పాల్గొననున్నారు.
న్యాయవ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు. న్యాయాన్ని మరింత సరళంగా, సౌకర్యవంతంగా చేయడానికి కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు కలిసి రోడ్ మ్యా్ప్ ను ఈ సమావేశంలో తయారు చేసేందుకు ప్రయత్నిస్తాయని పీఎంవో తెలిపింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల, ముఖ్యమంత్రుల ఉమ్మడి సమావేశాన్ని మొదటి సారి 1953లో నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు 38 సమావేశాలు జరిగాయి. చివరి సమావేశంలో 2016లో జరిగింది.