బుద్ధుని ఆలోచనలు మన భూగోళాన్ని మరింత శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా, సుస్థిరంగా మార్చగలవని ప్రధాని మోడీ అన్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ట్వీట్ చేశారు.
బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని నేపాల్ లోని బుద్దుని జన్మస్థలమైన లుంబినీలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. లుంబినీలోని మాయాదేవీ ఆలయంలో ఆయన పూజలు చేశారు.
‘బుద్ధ పూర్ణిమ నాడు బుద్ధుని సూత్రాలను గుర్తు చేసుకుంటున్నాను. వాటిని నెరవేర్చడానికి నిబద్దతతో పాటిచేందుకు ప్రయత్నిస్తున్నట్టు పునరుద్ఘాటిస్తున్నాము’ అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
లుంబినీ సందర్శన కోసం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నేపాల్ చేరుకున్నారు. జలవిద్యుత్, అభివృద్ధి, కనెక్టివిటీతో సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబాతో సమగ్ర చర్చలు జరిపారు.