కాంగ్రెస్ మిత్ర పక్షాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సవాల్ విసిరారు. పౌరసత్వ చట్టంపై రాద్దాంతం చేస్తున్న కాంగ్రెస్ మిత్ర పక్షాలు ప్రతి పాకిస్థాన్ పౌరుడికి పౌరసత్వం ఇస్తామని బహిరంగ ప్రకటన చేయాలని సవాల్ చేశారు. ఈ పార్టీలు ముస్లింలో భయాందోళన సృష్టిస్తున్నాయని ఆరోపించారు. పౌరసత్వం చట్టంతో ఏ ఒక్క పౌరుడికి నష్టం కలగదని పునరుద్ఘాటించారు.
జార్ఖండ్ ఎన్నికల సభలో ప్రధాన మంత్రి మాట్లాడుతూ..కాంగ్రెస్ కు దమ్మూ ధైర్యం ఉంటే ప్రతి పాకిస్థాన్ పౌరుడికి పౌరసత్వం ఇస్తామని బహిరంగంగా ప్రకటించాలన్నారు. మీకు ధైర్యముంటే జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 ని పునరుద్ధరిస్తామని చెప్పగలరా అని ప్రశ్నించారు.