పంజాబ్ నేషనల్ బ్యాంకు తన కస్టమర్లకు కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 1 నుండి ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా చెక్కులు పనిచేయవని ప్రకటించింది. ఈ బ్యాంకు ఖాతాదారులు కొత్త చెక్ బుక్స్ తీసుకోవాలని కోరింది.
2020 ఏప్రిల్ లో పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియెంటెడ్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం అయ్యాయి. అయినా పాత చెక్కులను ఇప్పటి వరకు వాడుకునేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు అవకాశం ఇచ్చింది. కానీ అక్టోబర్ 1 నుండి ఆ చెక్కులు పనిచేయవని ప్రకటించింది. ఖాతాదారులు కొత్త చెక్కులను వారి వారి శాఖల్లో తీసుకోవాలని సూచించింది.
అయితే, కొత్త చెక్ బుక్స్ కోసం బ్యాంకుకు వెళ్లలేకపోయిన వారు ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తోనూ ఆర్డర్ చేసుకునే వీలుంది.