కార్మికుల పొట్టకొట్టిన వజ్రాల మోదీ

నీరవ్‌మోదీ – పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌ ఎఫెక్ట్‌ హైదరాబాద్ మీదా పడింది. నగరంలోని నీరవ్‌మోదీ జెమ్స్‌ పార్క్‌లో ఈడీ తనిఖీలు చేపట్టి సంస్థను సీజ్‌ చేయడంతో కార్మికులు లబోదిబోమంటున్నారు. జెమ్స్‌ పార్క్‌ మూసివేతతో 700 కుటుంబాలు వీధినపడ్డాయని గీతాంజలి జెమ్స్‌ పార్క్‌ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు ఉపాధి చూపాలని కార్మికులు కోరుతున్నారు. గీతాంజలి జెమ్స్ పార్క్ ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి కార్మికులు ధర్నా చేశారు. ఆందోళన చేస్తున్న కార్మికులకు పలు రాజకీయ పార్టీల నేతలు మద్ధతుప్రకటించారు.