అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కంటతడి పెట్టారు. పోచారం పుట్టిన రోజు సందర్భంగా అసెంబ్లీలో మొక్కను నాటారు. అదే సమయంలో తమ చిన్న నాటి స్నేహితుడు మృతి చెందినట్టు తెలియడంతో ఒక్కసారిగా పోచారం కంటతడి పెట్టారు.
స్నేహితుడి మృతి నేపథ్యంలో పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండనున్నట్లు ఆయన ప్రకటించారు. సొంత నియోజక వర్గంలో పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసినట్లు ఆయన చెప్పారు. మిత్రుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అంత్యక్రియలకు ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లనున్నారు. అసెంబ్లీ ఆవరణలో జన్మదిన వేడుకలు నాకు తెలియకుండా ఏర్పాట్లు చేశారు. అందువల్ల కాదనలేకపోయాను.
నా నియోజక వర్గంలో ఇతర ప్రాంతాల్లో జరిపిద్దాం అనుకున్న వేడుకలను రద్దు చేయమని చెబుతున్నా.. నా అత్యంత సన్నిహితుడు చనిపోయాడు.. అందువల్ల ఎటువంటి వేడుకలు చేయొద్దన్నారు.నా స్నేహితుడికి నాకు 50 సంవత్సరాల అనుబంధముందన్నారు. శాసన సభా సమావేశాలు జరిగిన తరువాత నేను అక్కడికి చేరకుంటాను.. నా స్నేహితుడి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు.