కల్తీ మద్యం తాగి 10 మంది మృతి చెందారు. మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉండగా… వైద్య సహాయం అందిస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. మృతుల్లో ఏడుగురు మురౌనా జిల్లాలోని చెహ్రా మాన్పుర్ గ్రామానికి చెందిన వారు కాగా ఒకరు పెహ్వాలీ గ్రామస్థుడిగా గుర్తించారు.
పరిస్థితి విషమంగా ఉన్న 10 మందికి గ్వాలియర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.