పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. దాదాపు 19గ్రామాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవతున్నాయి. ఇప్పటికే వర్షాల వల్ల పోలవరం ప్రాజెక్టుకు చేరుకునే రోడ్డు మార్గం బురదమయంగా మారగ, సీనయ్య కొండ సమీపంలో రోడ్డు మార్గం నుండి 100పొడవునా మూడు మీటర్ల మేర కుంగిపోయింది. పైగా బురద ఉండటంతో వాహనాలు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదరవుతోన్నాయి. అప్పట్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే వెంటనే మరమ్మత్తులు చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పైగా పోలవరం పనులు నిలిచిపోయాయి.
పోలవరం నుండి పైడిపాక చెక్‌పోస్ట్ వరకు రోడ్డు మార్గాలు పునరుద్ధరణ ఆగిపోవడంతో పోలవరం నుండి పైడిపాక చెక్‌పోస్ట్ వరకు రోడ్డు మార్గాలు పునరుద్ధరించే నాథుడే లేకుండా పోయాడు. అటు రోడ్డు భవనాల శాఖ అధికారులు తమ పరిధి కాదని తప్పించుకుంటున్నారు. ఇటు పోలవరం ప్రాజెక్టులో ఏ గుత్తేదారుడు లేక అయోమయంలో ప్రాజెక్టు పనులు ఆగిపోయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోడ్డు మార్గాలు పునరుద్ధరించేది ఎవరు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు మార్గాలు పునరుద్ధరించాలని ఏజెన్సీ ముంపు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.