ఢిల్లీ :పోలవరం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలశక్తి శాఖ మరోసారి లేఖ రాసింది. పీఎంవో రాసిన లేఖపై రెండ్రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. గతంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే విషయంపై పీఎంవో లేఖ రాసింది. పోలవరంపై నిపుణుల కమిటీ, పీపీఏ నివేదికలో వ్యత్యాసాలపై స్పందించాలని చెప్పింది. పీఎంవో లేఖపై ఇప్పటివరకు ఎటువంటి సమాధానం ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి లేఖ పంపినట్టు సమాచారం.