తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. ఆహా.. ఓహో అంటూ ప్రభుత్వ పెద్దలు మురిసిపోతుంటారు. కానీ డాక్టర్ ప్రియాంక రెడ్డి కేసులో పోలీసుల ప్రవర్తన అత్యంత నీచంగా ఉంది. పోలీసుల వల్లే మా బిడ్డ మాకు దక్కలేదంటూ ప్రియాంక రెడ్డి తల్లితండ్రులు రోధిస్తున్నారు.
రాత్రి9.45కు ఫోన్ చేసిన నా కూతురు తర్వాత ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. రాత్రి 11గంటలకు మా బిడ్డ ఇంకా ఇంటికి రాలేదు అని పోలీసులకు ఫిర్యాదు చేస్తే… లవర్‌తో పోయిందేమో అంటూ హేళనగా మాట్లాడారు అంటూ ప్రియాంక రెడ్డి తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. త్వరలో పెళ్లి చేసి అత్తారింటికి పంపాలని కలలు కంటే… కాటికి పంపించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… మాట్లాడుతూ పోలీసుల మాటలు తీవ్రంగా బాధపెట్టాయని, భరించలేకపోతున్నామని, పోలీసులు సరైన సమయంలో స్పందిస్తే మా బిడ్డ బ్రతికి ఉండేదేమోనంటున్నారు.
ప్రియాంక రెడ్డి హత్య ఎలా జరిగిందంటే…
నిందితులను అరెస్ట్ చేస్తున్నాం, విచారణ జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు… ఇక్కడ ఎవరిదో డెడ్ బాడీ ఉందని చెప్పే వరకు పోలీసులు నిద్ర మత్తు వీడలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదు రాగానే పోలీసులు హుటాహుటిన గాలింపు చర్యలు చేపట్టి ఉంటే ప్రియాంక రెడ్డి బ్రతికి ఉండేదేమోనని ప్రియాంక రెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు.