మైక్రో ఫైనాన్స్ యాప్స్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అధిక వడ్డీ చెల్లించినా వేధిస్తూనే ఉన్నాయి. ఏమాత్రం ఆలస్యం అయినా సరే లోన్ తీసుకున్న వారి బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు మొబైల్ లో ఉన్న కాంటాక్ట్స్ ఉన్న వారందరికీ సమాచారం ఇస్తూ వేధిస్తూనే ఉన్నాయి.
యాప్స్ వేధింపులు బరించలేక పలువురు ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నోయిడా, గుర్ గావ్ ల నుండి యాప్స్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పలు యాప్స్ కు సంబంధించి ఢిల్లీలో ఏడుగురిని, హైదరాబాద్ లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. అంతేకాదు యాప్స్ నిర్వహిస్తున్న కాల్ సెంటర్లలో వందలాది కంప్యూటర్స్, ల్యాప్ టాప్స్ ను ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
యాప్స్ ప్రతినిధులు వేధిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఎవరూ లోన్స్ తీసుకోవద్దని హెచ్చరించారు.