కేంద్రం తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ రైతు చట్టాలపై రైతుల ఉద్యమం తారాస్థాయికి చేరింది. గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ల ర్యాలీ చేస్తామంటూ ఇప్పటికే ప్రకటించిన రైతులు, అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పోలీసులు ర్యాలీకి అనుమతి కూడా ఇచ్చారు.
ట్రాక్టర్ల ర్యాలీని శాంతీయుతంగా నిర్వహిస్తామని రైతు సంఘాల నేతల వద్ద ఢిల్లీ పోలీసులు సంతకాలు తీసుకున్నారు. సింగూ, టిక్రి, ఘాజిపూర్ పాయింట్ల వద్ద ట్రాక్టర్ల ర్యాలీ చేయాలని నిర్ణయించారు.
సింగూ బార్డర్ నుండి మొదలయ్యే ఫస్ట్ ర్యాలీ… సంజయ్ గాంధీ ట్రాన్స్ పోర్ట్ నగర్ నుండి బవానా వరకు సాగుతుంది. మొత్తం 62కి.మీ ఈ ర్యాలీ టిక్రీ బార్డర్ మీదుగా సాగుతుంది. మూడో ర్యాలీ కూడా మొదటి ర్యాలీతో కలిసి కుండ్లి మానేసర్ పల్వాల్ ఎక్స్ ప్రెస్ హైవే పై నుండి సాగుతుంది.
ఇక ఈ ర్యాలీలో పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉండగా… సంఘ విద్రోహా శక్తులు కలిసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.