ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ను కిడ్నాప్ చేస్తారన్న వార్తలు బయటకు రావడంతో ఆయనకు సెక్యూరిటీ పెంచారు. సినిమా పరిశ్రమకు దిగుమతి అయిన ఓ ప్రొడ్యూసర్-పొలిటీషియన్ బండ్ల గణేష్ ను కిడ్నాప్ చెయ్యడానికి ప్లాన్ చేశారని విజయవాడలో ప్రచారం మొదలైంది. గుణదలకు చెందిన చురకత్తుల కవి అనే రౌడీషీటర్ ను సదరు పొలిటీషియన్ ప్రొడ్యూసర్ ఈ పనికి నియమించారని విజయవాడలో టాక్. ఇతర నిర్మాతల మీద, నటుల మీద నిత్యం కేసులు వేసి వేధించే ఈ కేసుల రాజా అలియాస్ కడిగిన ముత్యంపై సినిమా పరిశ్రమ పీకల దాకా కోపంలో ఉంది. ఈ మధ్యే ఈ కేసుల రాజా తన క్యాషియర్ ని, పిఏ ని హైదరాబాద్ లో కిడ్నాప్ చేసి, విజయవాడ తీసుకెళ్ళి చిత్రహింసలకు గురిచేసి, ఆస్తులను రాయించుకున్న విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.
విజయవాడ రౌడీలు, పోలీస్‌లు నా చేతిలో ఉన్నారనీ, ముఖ్యమంత్రికి మొన్నే 60 కోట్లు ఎలక్షన్ సందర్భంగా ఇచ్చానని, నాకు ఎదురులేదని చెప్పే కేసుల రాజా బెదిరింపులకు బండ్ల గణేష్ లొంగుతాడా? వేచిచూద్దాం!