ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ప్రభుత్వానికి తొత్తుల్లా పని చేస్తుంటే తమ సమస్యలను ఎవరికి చెప్పుకపోవాలని వాపోతున్నారు విద్యార్ధులు. విద్యారంగ సమస్యల కొరకు శాంతియుతంగా రాస్తారోకో నిర్వహిస్తుంటే కర్కశంగా ప్రవర్తిస్తూ.. పోలీపులు తమను మానసికంగా హింసించారని పాలకుర్తి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు.
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో విద్యార్ధుల సమస్యల పరిష్కారించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్ధులతో కలిసి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న పాలకుర్తి ఎస్ఐ వంశీకృష్ణ తమను అవమానించారని విద్యార్థి సంఘ నాయకులని ఆరోపిస్తున్నారు.
విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ బూటుకాలుతో తన్ని, ఊడ్చుకుంటూ వెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యల పరిష్కారం కోసం పోరాడే హక్కు అందరికి ఉంటుందన్నారు. అది కాలరాసేలా ప్రవర్తించిన ఎస్సై పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు.
విద్యార్థి సంఘ నాయకులైన సందీప్, తరుణ్ లపై దుర్భాశలడి.. శారీరక వికలాంగుడని కూడా చూడకుండా కాలర్ పట్టుకొని ఈడ్చుకుంటూ తీసికేళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన ఎస్సై తన స్థాయిని మరిచి వీధి రౌడీల వ్యవహరించారని మండిపడ్డారు. ఎస్సై పై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరారు ఎస్ఎఫ్ఐ నాయకులు.