టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. ఈక్రమంలోనే అరెస్ట్ చేశారు పోలీసులు.
పట్టాభి అరెస్ట్ సందర్భంగా హైడ్రామా నడిచింది. మధ్యాహ్నం నుంచి ఆయన ఇంటి దగ్గరే ఉన్న పోలీసులు.. రాత్రి 9 తర్వాత అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంటి తలుపులు పగులగొట్టి మరీ అదుపులోకి తీసుకున్నారు. కాలింగ్ బెల్ కొట్టినా తలుపు తీయక పోవడం వల్లే బలవంతంగా అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు పోలీసులు.
పట్టాభి అరెస్ట్ సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని అన్నారు ఆయన భార్య. నోటీసు ఇచ్చిన వెంటనే అరెస్ట్ చేశారని చెప్పారు. తన భర్త ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని.. అలాగే తిరిగి రావాలన్నారు. ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని ఆవేదన వ్యక్తం చేశారు పట్టాభి భార్య.