ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మీడియా వాహనంపై దాడి చేసిన రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో వెంకటపాలెం,నెక్కెళ్ల, మాల్కాపురి గ్రామాలకు చెందిన శివబాబు, నరేష్, సురేంద్ర, శ్రీనివాసరావు, నాగరాజు, వెంకటస్వామి, నాయక్ అనే రైతులున్నారు. ఆదివారం తెల్లవారుజామున వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు తెనాలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైతుల అరెస్ట్ ను నిరసిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. రైతులను తక్షణమే విడుదల చేయాలని టీడీపీ నేత ఆలపాటి రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంబంధం లేని కేసులో అమాయకపు రైతులను అరెస్ట్ చేశారని ఆరోపించారు.