టైమ్ బావున్నప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. అదే టైమ్ లో మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధ మయ్యాడు. మరి పాత ప్రేమ గాజులు తొడుక్కుంటుందా..!? కొత్తపెళ్లికొడుకు పెళ్లిపీటల మీద ఉండగా టైమ్ బాంబ్ లా పేలింది.
తనను మూడేళ్లుగా ప్రేమించి, మరొకరితో పెండ్లికి సిద్ధమయ్యాడని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎస్ఐ శ్రీధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
మద్నూర్ మండలం మోగా గ్రామానికి చెందిన మారుతి అనే యువకుడి పెండ్లి సోమవారం మద్నూర్ మైథిలి ఫంక్షన్ హాల్లో జరగాల్సి ఉంది. బిచ్కుందకు చెందిన ఓ యువతి, మారుతి మూడేండ్లుగా ప్రేమించుకుంటున్నారు.
అయితే మరొకరిని పెండ్లి చేసుకుంటున్నాడని తెలియడంతో ఆ యువతి ఆదివారం బిచ్కుంద పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆదివారం రాత్రి మారుతిని అదుపులోకి తీసుకున్నారు.