సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లోకి కారులో దూసుకెళ్లి దుండగులు హల్‌చల్ చేసిన ఘటనలో పురోగతి లభించింది. ఇందుకు కారణమైన వ్యక్తులను పహాడి షరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ దృశ్యాలు, కార్ నెంబర్ ఆధారంగా వారిని పట్టుకున్నారు.
మోహన్ బాబు ఇంటికి వచ్చిన వారు మైలార్‌దేవ్‌పల్లిలోని దుర్గానగర్‌కు చెందిన యువకులుగా గుర్తించారు.ఈ మేరకు నలుగురిని అదుపులోకి తీసుకొని వారిని విచారిస్తున్నారు. వారి కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. వారే కావాలని చేసారా… లేకా ఎవరైనా పంపించారా… అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. .