బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రగతి భవన్‌కు వెళ్లారు. తనకు ఇచ్చిన బల్లెట్ ఫ్రూఫ్ వాహనం పదే పదే చెడిపోయిందని, ఎన్నిసార్లు చెప్పిన తన బాధ పట్టించుకోవడం లేదని, వాహనాన్ని మార్చాలని సీఎం కేసీఆర్‌ను కోరడానికి శుక్రవారం గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రగతి భవన్‌కు వెళ్లారు.
అయితే.. పోలీసులు రాజాసింగ్‌ను అడ్డుకోవడంతో తన వెంట తీసుకువచ్చిన బల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని ప్రగతి భవన్ ముందు వదిలేసి వెళ్లారు. ఇదే క్రమంలో రాజాసింగ్‌ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
అయితే.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఇంటికి వెళుతున్న సమయంలో బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్తున్న సమయంలో కారు టైర్ ఊడిపోయింది. గతంలో పలుమార్లు కూడా వాహనం ఇబ్బంది పెట్టింది. మరో కారు కేటాయించాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందన లేదని, పాత కారుకే మరమ్మతులు చేసి పంపిస్తున్నారని రాజాసింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే.
తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇచ్చేద్దామని ప్రగతిభవన్ కు వెళ్తే.. గేటు వద్దే తనను ఆపేశారని రాజా సింగ్ చెప్పారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం తాళాన్ని అక్కడే ఉన్న పోలీసు అధికారులకు ఇస్తే తీసుకోలేదని, దాంతో వాటిని అక్కడే పాడేశానని చెప్పారు. ఇంతలోనే పంజాగుట్ట ఇన్స్ స్పెక్టర్ వచ్చి తనను అరెస్ట్ చేసి డీసీఎంలో కూర్చోబెట్టారని తెలిపారు.
ప్రగతిభవన్ వెళ్లే ముందు తన వెంట ఉన్న గన్ మెన్లను తీసుకెళ్లలేదని, ఒంటరిగానే వెళ్లానని తెలిపారు. పాడైన బూల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తనకు ఎందుకు కేటాయించారని ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడిగేందుకే ప్రగతిభవన్ కి వెళ్లానని చెప్పారు.