కేసీఆర్ ను అరెస్ట్ చేయాలి.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ దీక్షకు దిగిన వైటీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతోపాటు ఆపార్టీ నేతలను కూడా అరెస్ట్ చేశారు.
మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్ లో ఆత్మహత్య చేసుకున్న రైతు రవికుమార్ కుటుంబాన్ని కలిశారు షర్మిల. తానున్నాననే భరోసాను వారికి కల్పించారు. న్యాయం కావాలంటూ దీక్షకు కూర్చున్నారు. అయితే పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేశారు. దాదాపు మూడున్నర గంటల పాటు షర్మిల దీక్ష కొనసాగింది.
అంతకుముందు తొలివెలుగుతో ప్రత్యేకంగా మాట్లాడిన షర్మిల.. రవి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాయం అందేదాకా దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. స్వయంగా సీఎం పేరు చెప్పి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. వెంటనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులను ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తున్నందుకు కేసీఆర్ ను అరెస్ట్ చేయాలని తొలివెలుగుతో అన్నారు షర్మిల.
రైతు రవి కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్ షర్మిల గారు చేస్తున్న నిరాహార దీక్షపై ప్రభుత్వం కుట్ర పన్నింది.శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి, రామాయంపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.#justiceforravikumar #savefarmers #yssharmila pic.twitter.com/MpGAyBV2SV
— YSR TELANGANA PARTY (@YSRTelangana) December 11, 2021
Advertisements