నగరంలోని టోలీచౌకీ వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. నల్లపురెడ్డి వంశీధర్ రెడ్డి అనే వ్యక్తి నుంచి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
గోవా నుంచి LSD, MDMA, ఎస్టాకి పిల్స్ను తీసుకొచ్చి హైదరాబాదులో వంశీధర్ రెడ్డి విక్రయిస్తున్నాడు. తమకు అందిన సమాచారంతో టోలీచౌకీలో వంశీధర్ కారును అధికారులు తనిఖీ చేశారు.
అలాగే కూకట్పల్లిలో మరో యువకుడు గొట్టిముక్కల పృధ్వీరాజ్ను అరెస్ట్ చేశారు.వీరి వద్ద నుంచి 210 ఎస్టకి పిల్స్ MDMA ,27 LSD బొల్ట్లు,కియా కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Advertisements
కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.