కరీంనగర్ కు చెందిన ఆర్టీసి డ్రైవర్ నంగునూరీ బాబు బుధవారం సరూర్ నగర్ లో జరిగిన సభలో గుండెపోటువచ్చి మృతి చెందిన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారుజామున ఆయన మృతదేహాన్ని బాబు ఇంటికి పోలిసులు తరలించారు. దీంతో ఆగ్రహించిన ఆర్టీసి జేఏసి, ప్రతిపక్షనేతలు గురువారం బంధుకు పిలుపునిచ్చారు. గురువారంనుంచి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మందకృష్ణమాదిగ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, టిపిసీసీ వర్కింగ్ ప్రెసిడెంటు పొన్నం ప్రభాకర్, తెలంగాణా జనసమితి అధ్యక్షుడు ప్రో కోదండరాం, సిపిఐ నేత చాడడ వెంకట రెడ్డి , సిపిఎం నేత వీరభధ్రం, ఆర్టీసీ కార్మికులు, నేతలు హజరయ్యారు.
బాబు మృతదేహం తో యాత్ర చేపట్టిన క్రమంలో పోలిసులకు అఖిలపక్షనేతలకు మధ్య తోపులాట జరిగింది. పోలిసు కమీషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు మృతదేహాన్ని పోలిసులు తరలించి అంత్యక్రియలు చేశారు. ప్రసుత్వవైఖరిని నిరశిస్తూ ప్రతిపక్షాల నాయకులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. వంటావార్పు చేపట్టారు . మరోవైఫు బిజేపి ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తా లో ఆందోళఞ చేసారు. ఈ ఆందోళనల నేపథ్యం లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై పోలీస్ లు అత్యుత్సాహం చూపించారు. బండి సంజయ్ ని పక్కకు లాక్కుంటూ తీసుకెళ్లారు. ఎంపీ బండి సంజయ్ పై పోలీస్లు చెయ్యి చేసుకున్నారు .