ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మీడియాలో చూపించకుండా పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. కార్మికులు సమ్మె సమయంలో వెల్లడిస్తున్న తమ ఆవేధనను చూపించకుండా, సమ్మె వీడియోలు తీయకూడదని దౌర్జన్యానికి దిగారు. మహబూబ్‌నగర్‌లో పోలీసుల వైఖరిపై జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి.
నెల రోజులకు పైగా అర్ధాకలితో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బయటకు ప్రపంచానికి చూడకుండా మహబూబ్‌నగర్‌లో పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిరోజులుగా నిరసనలకు దిగుతున్న కార్మికులపై ముఖ్యంగా మహిళా కార్మికులపై పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై వార్తలు రావటంతో గుర్రుగా ఉన్న పోలీసులు, వీడియోలు తీయకూడదంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు.
ఇప్పటికే పెద్ద సంస్థలు అని చెప్పుకునే మీడియా హౌజ్‌లు మా పక్షాన ఎలాగు నిలబడటం లేదు, ఇప్పుడు మాకు అండగా ఉన్న కొందరిని కూడా లేకుండా ప్రయత్నం చేస్తున్నారా అని ఆర్టీసీ కార్మిక సంఘాలు, కార్మికులు మండిపడుతున్నారు.
Advertisements