ఫ్రెండ్లీ పోలీస్ పేరు మీద పోలీసులు చేస్తున్నఅరాచకం ఇది. ఒంటిపై వాతలు తేలేలా .. గొడ్డును చితకబాదినట్టు బాదటమే.. ఇక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్. జరిగిన ఘటన విన్నా.. ఒళ్లంతా కమిలిన ఆ దళిత యువకుడి ఫోటోలు చూసినా..ఎవరైనా షాక్ తినాల్సిందే.
షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలో రెండు రోజుల క్రితం నిడుదవెల్లి శ్రీను అనే ఒక దళిత యువకుడిని చితక బాదారు. బీజేపీ ఫ్లెక్సీ చినిగిందని ఫోన్లో ఇచ్చిన బీజేపీ నాయకుడి ఫిర్యాదు మేరకు ఎటువంటి కేసు బుక్ చెయ్యకుండా ఒక దళిత యువకుడిని కేశంపేట పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్ళి నిన్నఅంతా స్టేషన్ లో చితక బాదారు.
గురువారం పొద్దున్న ఇంటికి పంపించారు. నిన్నమధ్యాహ్నం బాధితుడు తెలంగాణ కాంగ్రెస్ యస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతం ను సంప్రదించగా .. వారు కేసు దర్యాప్తు కోసమై డిమాండ్ చేస్తున్నారు.
దళిత సంఘాలు దయచేసి మేలుకోవాలని.. ఫ్యాక్షన్ పోలీసుగా మారిన కేశంపేట సీఐ సస్పెండ్ అయ్యేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు.