రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఇంటిని పోలీసులు శుక్రవారం చుట్టు ముట్టారు. బస్సు ఛార్జీలు పెంచుతూ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంపై నిరసనలకు ఆయన పిలుపు నిచ్చారు.
ఈ క్రమంలో జూబ్లీ బస్ స్టేషన్ లో ప్రయాణీకులు, ఆర్టీసీ సిబ్బందితితో ముఖాముఖి నిర్వహించాలని బీజేపీ నేతలు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ని జేబీఎస్ కు వెళ్లకుండా నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచడాన్ని బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. బస్సు ఛార్జీల పెంపుతో సామాన్యుడిపై భారం పడుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆర్టీసీ నిర్ణయానికి వ్యతిరేకంగా జేబీఎస్ లో నిరసనలు చేపట్టి తీరుతామని బీజేపీ నేతలు అంటున్నారు.
మరోవైపు బీజేపీ నేత జిట్టా బాలకృష్ణరెడ్డిని పోలీసులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకోవడపైన బీజేపీ నేతలు మండిపడుతున్నారు. వనస్థలిపురం ఆస్పత్రిలో జిట్టాకు వైద్య పరిక్షలు నిర్వహిస్తున్నారు.