హైదరాబాద్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. చైన్ స్నాచింగ్ ఘటనలతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఆదివారం తెల్లవారు జాము నుంచే స్నాచర్ల ఫోటోలతో రోడ్లపై పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. నిందితులను గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్, యూసఫ్ గూడ, అమీర్ పేట్ కేఎల్‌ఎమ్ షాపింగ్ మాల్, పంజాగుట్ట పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.
మొత్తం 13 పోలీసు స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా నాకాబంది నిర్వహిస్తున్న పోలీసులు. ఫోటోలోని చైన్ స్నాచింగ్ చోరీలకు పాల్పడే ముఠాగా పోలీసులు గుర్తించారు. ఈ ఫోటోల్లోని వ్యక్తులు ఎక్కడైనా తారసపడ్డ గుర్తించిన తక్షణమే 100 కానీ, స్థానిక పోలీసులకు కానీ సమాచారం ఇవ్వాల్సిందిగా అధికారులు తెలిపారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు గాను మిగతా గ్రూపుల్లో కూడా పోస్ట్ చేయాలని పోలీసులు కోరుతున్నారు.
శనివారం హైదరాబాద్‌లో రెండు గంటల వ్యవధిలో దుండగులు 6 చోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు . ఓయూ, ఉప్పల్, నాచారం, రాంగోపాల్ పేట పోలీసు స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉప్పల్‌లో రెండు, నాచారం, చికలగూడ, రాంగోపాల్‌పేట, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్కొక్కటి చొప్పున చైన్ స్నాచింగ్‌లు జరిగాయి.
చైన్‌స్నాచర్లు తొలుత ఉప్పల్‌లో ఉదయం 6.20 గంటలకు చోరీ ప్రారంభించి.. చివరగా ఉదయం 8.10 రామ్‌గోపాల్ పేటలో ముగించారు. ఇందుకోసం దుండగులు ఒక్క పల్సర్ బైక్‌ను వినియోగించారు. బైక్ మీద తిగిరుతూ.. ఉప్పల్, కళ్యాణపురి, నాచారం, ఓయూలోని రవీంద్రనగరల్, చిలకలగూడ, రామ్‌గోపాల్ పేట ప్రాంతాల్లో గొలుసు చోరీలకు పాల్పడారు.