మనోజ్, మమత…క్లాస్ మేట్స్. ఫ్రెండ్ షిప్ గా స్టార్ట్ అయిన వారి మ్యాటర్ కాలేజ్ లోనే లవ్ గా మారింది. ఇంజనీరింగ్ అవ్వగానే ఇద్దరికి మంచి జాబ్స్ కూడా లభించాయ్. ఇక తమ మ్యాటర్ ఇంట్లో చెప్పాలనుకున్నారు. కానీ మనోజ్ వాళ్ల నాన్న మూర్తి చాలా నిక్కచ్చి మనిషి. పూట గడవని పరిస్థితిల్లో హైద్రాబాద్ కు వలస వొచ్చి ఇప్పుడు మంచి కాంట్రాక్టర్ గా గౌరవ మర్యాదలు పొందుతున్నాడు. నాన్న అంటే మనోజ్ కు చాలా భయం.
ఓ రోజు మనోజ్ మూర్తి దగ్గరికి వెళ్ళి , డాడీ అన్నాడు. ఆ… చెప్పురా అంటూ తండ్రి ఫేస్ మనోజ్ వైపు టర్న్ ఇచ్చాడు. వెంటనే మనోజ్ ఏం లేదు డాడీ . ఎక్కడికి రెడీ అవుతున్నారు అని అడిగాడు. అప్పుడు మూర్తి… మా రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ అందరం కలిసి మా బైక్స్ మీద అలా సిటీ అవుట్ స్కర్ట్ కు వెళుతున్నాం సాయంత్రం వరకూ వచ్చేస్తాం అన్నాడు.
అంతలోనే…ఓ పది మంది మూర్తి ఫ్రెండ్స్ ఇంటి ముందు తమ తమ బుల్లెట్స్ బండ్లతో హరన్లు కొడుతున్నారు. అరెయ్ మనోజ్ ఈ రోజు ఆదివారమే కదా నీ బైక్ ఇవ్వు…అవసరమైతే కార్ వాడుకో అంటూ బైక్ కీస్ తీసుకొని బయలుదేరాడు మూర్తి. బండి స్టార్ట్ చేసి ఒకరి తర్వాత ఒకరు లైన్లో బయలుదేరుతున్నారు. ఉప్పల్ క్రాస్ రోడ్డు దగ్గరికి రాగానే పోలీసులు బండ్లను చెక్ చేస్తున్నారు…మూర్తి వాళ్ల గ్రూప్ లో అందరి పేపర్స్ చెక్ చేస్తున్నారు. అందరివి కరెక్టే ఉన్నాయ్.
కానీ మూర్తిని మాత్రం పట్టుకున్నారు పోలీసులు.. ఎంటండీ..! నా డాక్యుమెంట్స్ అన్నీ కరెక్టు గానే ఉన్నాయ్..లైసెన్స్ కూడా ఉంది..అయినా ఎందుకు పట్టుకున్నారని పోలీసులతో వాదిస్తున్నాడు మూర్తి. అన్నీ ఓకే కానీ మీ బైక్ మీద మూడు చలాన్లున్నాయ్ అవి కట్టలేదంటూ డీటేల్స్ చూపించాడు పోలీస్ మూర్తికి…
మూర్తితో పాటు…. అతని ఫ్రెండ్స్ కూడా ఎక్కడెక్కడ సిగ్నల్ జంప్ అయ్యారో పోలీస్ చూపిస్తున్న సిస్టమ్ లో చూస్తున్నారు. ఒకటి నెక్లెస్ రోడ్ దగ్గర రాంగ్ పార్కింగ్. రెండు హైటెక్ సిటీ దగ్గర సిగ్నల్ జంప్.. మూడు కోఠి దగ్గర రాంగ్ సైడ్ డ్రైవింగ్. ఆ ఫోటోలను చూసిన మూర్తి మరియు అతని ఫ్రెండ్స్ అశ్చర్యపోయారు!
మొదటిది మనోజ్, మరో అమ్మాయి… నో పార్కింగ్ దగ్గర బండి ఆపి ఒకరికొకరు ఐస్ క్రీమ్ తినిపించుకుంటున్న ఫోటో. రెండో ఫోటో….. మనోజ్ డ్రైవింగ్ మరో అమ్మాయి వెనుకనుండి మనోజ్ ను హట్టిగా హత్తుకుంది. సిగ్నల్ జంప్. మూడో ఫోటో…. మనోజే , రాంగ్ సైడ్ డ్రైవింగ్. సేమ్ అదే అమ్మాయి వెనుక ఉంది…ఈ ఫోటోలో ఇంకా గట్టిగా హత్తుకొని ఉంది ఆ అమ్మాయి మనోజ్ ను.
Advertisements
చలాన్ల కార్యక్రమం ముగిసిన తర్వాత పార్టీలో మూర్తి ఫ్రెండ్స్…అరెయ్…. మూర్తి, అబ్బాయ్ అమ్మాయి ఈడూజోడూ చాలా బాగుంది. వాళ్లు కూడా చాలా దగ్గర అయిపోయారు కదరా.. ఓకే చేసేయ్ అన్నారు. మా వాడు ఇంత ముదురు అనుకోలేదురోయ్ అంటూ కొడుకు మీదే జోక్ పేల్చాడు మూర్తి. ఇంటికెళ్లగానే మనోజ్ ను ఆరా తీయడం. మ్యారేజ్ ఓకే చేయడం. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేయడం చకాచకా జరిగిపోయాయ్. వారం రోజుల తర్వాత మనోజ్, మమత స్వీట్ బాక్స్ ను తీసుకెళ్లి ఆ పోలీస్ చేతిలో పెట్టి ఆశీర్వాదం కోరారు.