టీఆరెస్ వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ పై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. వర్ధన్నపేట మన దేశం పత్రిక రిపోర్టర్ ప్రవీణ్ పై దాడి చేయించారని బాధితుడు వాపోయాడు. తొలి వెలుగుతో టెలిఫోన్ లో మాట్లాడిన ప్రవీణ్ వరంగల్ ఎంపిని ప్రశ్నించినందుకు హన్మకొండ సీఐ తో కొట్టించారని ఆరోపించాడు.
వివరాల్లోకి వెళితే, పైన మీరు చూస్తున్న వార్త మనదేశం అనే పత్రికలో వర్ధన్నపేట జర్నలిస్ట్ ప్రవీణ్ ప్రచురించారు . కరోనా కష్ట కాలంలో కూడా వరంగల్ ఎంపీ కనిపించట్లేదని ఆ వార్త సారాంశం .అయ్యా ఎంపీ గారూ ఎక్కడున్నారయ్యా , కరోనాతో జనం సస్తున్నారు దయచేసి బయటకు రండి అని జర్నలిస్ట్ ప్రవీణ్ ప్రశ్నించాడు . ప్రశ్నించడమే ప్రవీణ్ నేరం అయిపోయింది .ఇంకేముంది , డైరెక్ట్ గా ఎంపీ గారు ఎంటరయ్యాయారు . పోలీసులతో జర్నలిస్ట్ ప్రవీణ్ ను చేయి విరిగేలా కొట్టించారని జర్నలిస్ట్ ప్రవీణ్ చెప్పుకొచ్చారు.నాకు ఏదైనా జరిగితే ఎంపి పసునూరి దయాకర్ దే బాధ్యత అన్నారు.ఈ విషయం ఇంతటితో వదిలేయాలని ఎంపి రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది.
ఒక్కసారి జర్నలిస్ట్ ప్రవీణ్ మెడికల్ రిపోర్ట్స్ చూస్తే ఎంత దారుణంగా కొట్టారో తెలుస్తుంది .
అధికార మదంతో కొట్టుకుంటున్న నాయకులు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.వారిచ్చిన లంచాలకు రుచి మరిగిన ఇలాంటి పోలీసులు జనం ప్రాణాలు తీసేలా ప్రవర్తిస్తున్నార ని జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి.
౩లక్షలకు పైగా మెజారిటీ తో ప్రజలు మిమ్మల్ని గెలిపించింది జనాన్ని కాపాడడానికి అని జర్నలిస్ట్ , ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి .వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు . ఎంపీ పై , హన్మకొండ సీఐ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు .