ఖమ్మం జిల్లాలో రద్దయిన పాత నోట్ల డంప్‌ను, దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తామని ఇంటిని అద్దెకు తీసుకొని 100కోట్ల డంప్ ఉందని చెబుతూ పాత నోట్ల మార్పిడి, దొంగ నోట్ల చలామణి చేస్తున్న మధార్ అనే ముఠాను పట్టుకున్నారు. పైనా, కింద 500, 1000నోట్లను పేర్చి, మధ్యలో చిత్తుకాగితాలను ఉంచారు. ఆ డంప్‌ను చూపుతూ తమది 100కోట్లకు పైగా టర్నోవర్ ఉంటుందని నమ్మబలుకుతూ మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసుతో సంబంధమున్న మధార్ ముఠాను, ముఠాకు సహకరించిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.