కర్ణాటకకు గంజాయిని రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టైన వారిలో తెలుగు సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ హాతీరామ్ ఉన్నారు. ఆయనను కేసులో ఏ 2 నిందితుడిగా ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్టులకు గంజాయి సరఫరా చేస్తుంటంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
కురుక్షేత్రం, యుద్ధం శరణమ్ గచ్ఛామి మూవీలకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన పనిచేశారు. కర్ణాటకకు గంజాయిని సరఫరా చేస్తుండగా హాథీరామ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు.
దీనిపై గతంలోనే తమకు సమాచారం అందిందన్నారు. ఈ క్రమంలో సోమవారం విశ్వసనీయ సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నట్టు తెలిపారు. వారి దగ్గర నుంచి మొత్తం 190 కేజీల గంజాయి, మొబైల్ ఫోన్స్, కారును స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.