దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై ప్రభుత్వ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 18 కేసులు పెట్టి, 67 రోజులు జైలు జీవితం గడిపి వచ్చిన రెండు రోజులకే మళ్లీ జైలుకు పంపేందుకు మరో కేసు నమోదు చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టచ్ చెయ్యని పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు.
జైలు నుండి బయటకు వచ్చాక జగన్, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జైలు నుండి విడుదలై బయటకు వస్తున్న సందర్భంలో అభిమానులు పోటేత్తారు. ర్యాలీగా చింతమనేనితో కలిసి నడిచారు. దాంతో నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ తీశారంటూ పోలీసులు చింతమనేనిపై మరో కేసు నమోదు చేశారు.
ఇది 19 నెంబర్, ఈ సంఖ్య ఎంత పెంచుకుంటారో పెంచుకోనివ్వండి… మేం సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వ కక్షపూర్తితంగా వ్యవహరిస్తుందనే విషయం ప్రజలకు కూడా అర్థమయిందని చింతమనేని అనుచరులు మండిపడుతున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నంత కాలం చింతమనేనిని జైలుకే పరిమితం చేస్తారేమో అని టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.