తాడేపల్లి పట్టణం సీతానగరం సమీపంలోని పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఓ నివాసంలో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 8మంది మహిళలను అరెస్ట్ చేశారు. దాదాపు లక్షా 36వేల రూపాయలు, 8 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఓ మగ్గురు పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే… పట్టుబడ్డ వారందరూ మహిళలు కావటం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇంతవరకు పేకాట స్థావరాల్లో మహిళలు పట్టుబడటం చాలా అరుదు.