5 సంవత్సరాల బాలున్ని కిడ్నాప్‌ చేసిన 15 సంవత్సరాల అబ్బాయి - Tolivelugu

5 సంవత్సరాల బాలున్ని కిడ్నాప్‌ చేసిన 15 సంవత్సరాల అబ్బాయి

police caught meerpet 5 years boy kidnap case, 5 సంవత్సరాల బాలున్ని కిడ్నాప్‌ చేసిన 15 సంవత్సరాల అబ్బాయి

మూడు లక్షల కోసం అర్జున్ అనే బాలున్ని కిడ్నాప్‌ చేసిన దుండగులను మూడు గంటల్లోనే చాకచక్యంగా పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. మీర్‌పేట్‌ టీఎస్సార్ కాలనీలో ఉండే రాజ్‌కుమార్ కొడుకు అర్జున్‌ ఆదివారం మధ్యాహ్నం మూడుగంటల సమయంలో ఇంటిదగ్గర ఆడుకుంటుండగా… పదవ తరగతి చదువుతున్న వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ విద్యార్థిపై గతంలో డబ్బులు దొంగిలించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్ ఆధారంగా నిందుతున్ని మూడుగంటల్లో పట్టుకున్నారు పోలీసులు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp