ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణ చేస్తున్నారని అనుమానించిన పోలీసులు… లారీని స్టేషన్‌కు తరలించారు. భారీగా ఎర్ర చందనం పట్టుకోవటంతో… ప్రమోషన్ పక్కా అని పోలీసులు సంబురపడ్డారు. కానీ సీన్ కట్ చేస్తే పోలీసులు తప్పులో కాలేశామని తెలుసుకొని చేతులు కాల్చుకున్నారు.
కేరళ రాష్ట్రం నుండి ఎర్ర చందనం దుంగలను పోలి ఉన్న లారీ అనంతపురం మీదుగా హైదరాబాద్ రావాల్సి ఉంది. కానీ అనంతపురం పోలీసులు లారీని ఆపి… స్టేషన్‌కు తరలించారు. ఎర్ర చందనం దుంగలు ఎక్కడి నుండి తెచ్చారు, అక్రమ రవాణ అంటూ లారీ డ్రైవర్‌ను ప్రశ్నించారు. ఇవి ఎర్రచందనం కాదు సార్ రబ్బర్ వుడ్… కాకపోతే సినిమా సెట్ కోసం ఎర్రచందనంలా తయారు చేశారు ఎని ఎంత చెప్పినా వినలేదు. చివరకు అది ఎర్రచందనం కాదని తెలుసుకొని అవాక్కయ్యారు.
ఆ రబ్బర్‌వుడ్ లోడ్‌ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ కోసం తీసుకొస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ తాజా సినిమా సెట్ కోసం ఈ రబ్బర్ వుడ్ తెప్పిస్తున్నట్లు సమాచారం.