సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో బాంబు కలకలం రేగింది. శబరి ఎక్స్ ప్రెస్ లో బాంబు పెట్టినట్లు పోలీసులకు ఫోన్ వచ్చింది. దీంతో అటు స్టేషన్ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు.
రైలును నిలిపివేసిన అధికారులు.. బాంబ్, డాగ్ స్వ్కాడ్ తనిఖీలు చేపట్టారు. విషయం తెలిసి స్టేషన్ లోని ప్రయాణికులు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇటు ఫోన్ చేసిన ఆగంతకుడిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.
శబరి ఎక్స్‌ప్రెస్ దక్షిణ మధ్య రైల్వే జోన్ లో కీలకం. నాలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతూ ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దీని రూట్ ఉంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం వరకు శబరి ఎక్స్ ప్రెస్ రాకపోకలు సాగిస్తుంటుంది. మొత్తం 1,568 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. దాదాపు 30 గంటల 25 నిమిషాల పాటు ఈ ప్రయాణం ఉంటుంది. గతంలో హైదరాబాద్ నుంచి ఎర్నాకుళం వరకే దీన్ని ఉపయోగించేవారు. 2005 మార్చి 27 నుండి తిరువనంతపురం వరకు పొడిగించారు.