హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. తెలంగాణ పోలీసు శాఖను దేశంలోనే ఆదర్శంగా నిలపటమే లక్ష్యంగా ఈ సెంటర్ రూపుదిద్దుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అత్యాధునిక సాంకేతికత సదుపాయాలతో ఈ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. సాంకేతికత పరిజ్ఞానం వినియోగించుకోవటంలో ముందుండాలనే లక్ష్యంతో…అన్ని విభాగాలను సమన్వయపరిచి ఒక ఫ్యూజన్ సెంటర్ లా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఇందులో చాలా ప్రత్యేకతలున్నాయి. దీన్ని పర్యావరణహిత భవనంగా కట్టాం. దీన్ని ఐదు టవర్లుగా విభజించాం. టవర్ -ఏ లో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఉంటుంది. టవర్ -బీలో రాష్ట్రానికి సంబంధించిన అన్ని టెక్నాలజీస్ ఉంటాయి.
టవర్ – సీ లో ఆడిటోరియం, టవర్- డీలో మీడియా, టవర్-ఈ అనేది కమాండ్ కంట్రోల్ సెంటర్, డేటా సెంటర్ ఉంటుంది. పర్యావరణహిత, ఐకానిక్ భవనాన్ని రేపు ప్రారంభించేందుకు అన్ని సిద్ధం చేశామని సీపీ ఆనంద్ తెలిపారు.