మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారని మహబూబ్ నగర్ వాసులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇది తప్పుడు కేసు అంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా.. ఈ క్రమంలోనే సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
పోలీసుల కన్ఫెక్షన్ రిపోర్ట్ లో శ్రీనివాస్ గౌడ్ వేధింపులే కారణమని రాఘవేంద్ర రాజు తెలిపాడు. తమ కుటుంబంపై 30 అక్రమ కేసులు పెట్టారని వాపోయాడు.
ఆధార్ ఎన్ రోల్ వస్తే.. అధికారులకు చెప్పి నష్టం వచ్చేలా శ్రీనివాస్ గౌడ్ చేశారని అన్నాడు రాఘవేంద్ర రాజు. అలాగే బార్ అండ్ రెస్టారెంట్ లో రోజూ దాడులు నిర్వహించే వారని వివరించాడు.
Advertisements
ఒకే రోజు 13 ఎక్సైజ్ కేసులు పెట్టారని తెలిపాడు. లీజు అమ్ముకున్నా.. బిల్డింగ్ సీజ్ చేయించారని.. 2017 నుంచి తనను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపాడు. తన కుటుంబాన్ని శ్రీనివాస్ గౌడ్ టార్గెట్ చేశారని చెప్పాడు. అందుకే శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నినట్లు.. రాఘవేంద్ర రాజు విచారణలో ఒప్పుకున్నట్లు కన్ఫెషన్ లో పొందుపరిచారు పోలీసులు.