ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజురోజు కు ఎక్కువ అవుతుంది. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగటంతో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రజల ప్రాణాలను కాపాడటానికి నిరంతరం కరోనా తో డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు యుద్ధం చేస్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రాణాలను తెగించి కంటికి కనిపించని కరోనా వైరస్ తో పోరాటం చేస్తున్నారు. కాగా తాగాజా కరోనా సోకి మొదటి సారిగా ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. 2007 బ్యాచ్ కి చెందిన దయాకర్ రెడ్డి కరోనా వ్యాధితో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొంత సేపటి క్రితం మృతి చెందారు. దయాకర్ కులసుంపుర స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు.