రవిప్రకాశ్ అరెస్ట్‌లో పోలీసులు అత్యుత్సాహన్ని ప్రదర్శించారా…? ఆర్థికపరమైన అంశాల దర్యాప్తులో నిబంధనలు గుర్తులేవా… లేదా పక్కనపెట్టేశారా…? కోర్ట్ హాల్‌లో బయటపడ్డ అసలు సంగతేంటీ…?
ఆర్థికపరమైన అంశాల దర్యాప్తుకు, ఇతర కేసుల దర్యాప్తుకు కొంత తేడా ఉంటుంది. విచారణకు పిలిచే దగ్గర నుండి… అరెస్ట్‌లు, కోర్టు ముందు ప్రవేశపెట్టే వరకు నిబంధనలు వేరుగా ఉంటాయి. కానీ మీడియా లెజెండ్ రవి ప్రకాశ్ విషయంలో మాత్రం విచారణ సంగతి అటుంచితే, అరెస్ట్ విషయంలోనూ పోలీసులు సరైన నిబంధనలు పాటించలేదు.
అరెస్ట్ నాటికే ఎన్.సి.ఎల్.టీలో ఉన్న కేసు, హైకోర్టు ముందస్తు బెయిలు అంశాలు పక్కనపెడితే…. బంజారాహిల్స్ పోలీసులు రవిప్రకాశ్ అరెస్ట్‌ను అధికారికంగా చూపించింది 12గంటలకు. అందుకు సంబంధించిన ఎఫ్.ఐ.ఆర్ కాపీలో చూపించిన సెక్షన్లు 418,420,409. కానీ ఇవన్నీ ఆర్థికపరమైన ఆరోపణలతో కూడిన సెక్షన్లు. వీటికి సంబంధించి అరెస్ట్ చేయాలంటే ముందుగానే కోర్టులో ఎఫ్.ఐ.ఆర్ రెజిస్టర్ చేసి తర్వాత అరెస్ట్ చెయ్యాలి….కానీ అలా చేయకుండా… మద్యాహ్నం 12గంటలకు అరెస్ట్‌లు చేసి, 2.30గంటలకు ఎఫ్.ఐ.ఆర్ కోర్టులో రెజిస్టర్ చేసారు. అంటే… నిబంధనలకు నీళ్లు వదిలి, అరెస్ట్ చేసేందుకు అత్యుత్సాహాం చూపించినట్లు స్పష్టంగా కనపడుతోంది. దీనిపై రవిప్రకాశ్ తరుపు లాయర్లు ప్రద్యుమ్న కుమార్ రెడ్డి, రజినీకాంత్ రెడ్డిలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అయితే, పోలీసుల అత్యుత్సాహం… అరెస్ట్ చేసేందుకు చూపించిన చొరవపై జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి. సీనీయర్ జర్నలిస్ట్‌పై ఇలా చేశారంటే దీని వెనక బలమైన ఒత్తిళ్లు పనిచేసి ఉంటాయని వారు ఆరోపిస్తున్నారు.