విశాఖ: ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దులో పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఖైర్‌పుట్ పిఎస్ పరిధిలోని బోండా కొండల దగ్గర ఈ కాల్పులు జరిగాయి. ఇఓఎఫ్ ఎస్పీ రిషికేశ్ ఖిలారి డీవీఎఫ్ ఎస్ఓజీ బృందానికి మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరువర్గాలూ కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పులలో జయరామ్ అనే కానిస్టేబుల్, ఓ మావోయిస్టు మృతి చెందాడు. మరో జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలిస్తున్నారు.