దిశ ను హత్యాచారం చేసిన నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం ఇవాళ ఉదయం చటాన్ పల్లి తీసుకెళ్ళి విచారణ చేస్తున్న సమయం లో పారిపోతుండగా ఎన్ కౌంటర్ చేశారు. దిశ ను ఎక్కడైతే చంపేశారో అక్కడే ఎన్ కౌంటర్ చేశారు పోలీస్ లు.
ఎన్ కౌంటర్ లో ఆరిఫ్, నవీన్, చెన్న కేశవులు, శివ మృతి చెందారు. 2004 లో స్వప్నిక , ప్రణీత కేసులో కూడా ఆసిడ్ దాడి చేసిన నిందితులపై ఇదే రకంగా ఎన్ కౌంటర్ జరిగింది. అప్పుడు ఈ కేసును పోలీస్ ఆఫీసర్ సజ్జానార్ పర్యవేక్షించారు. ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్ లో కూడా సజ్జనర్ దే కీలక పాత్ర.ఇవాళ తెల్లవారు జామున 3.30 నిమిషాలకు ఎన్ కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది.
తెల్లవారు జామున కావడంతో చటాన్ పల్లి ప్రాంతంలో పూర్తిగా చీకటిగా ఉండడంతో ఆ నలుగురు నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారని పోలీసులు చెబుతున్నారు. జరిగిన ఎన్ కౌంటర్ పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.