కొద్దిరోజులుగా ఫైనాన్స్ యాప్స్ అధికారుల వేధింపులు తట్టుకోలేక పలువురు ఆత్మహత్య చేసుకోవటంతో పోలీసులు ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. గూగుల్ ప్లేస్టోర్ నుండి ఏయే యాప్స్ ఫైనాన్స్ ఇస్తున్నాయో చూసిన పోలీసులకు కళ్లు చెదిరే నిజాలు భయటపడ్డాయి.
ప్లేస్టోర్ లో యాక్టివ్ గా ఉంటున్న ఫైనాన్స్ యాప్స్ దాదాపు 200కు పైగా ఉన్నట్లు గుర్తించారు. ఈ యాప్స్ లో ఎక్కువ భాగం చైనావే కాగా, ఆర్బీఐ నిబంధలను ఉల్లంఘించి… ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు యధేచ్ఛగా దోపిడీ చేస్తున్నట్లు గుర్తించారు. హిజీ లోన్ పేరుతో అధిక వడ్డీ వసూలు చేస్తున్నారని, ఇటీవల వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా… వారి అకౌంట్ వివరాలు తీసుకొని మొత్తం కూపీ లాగుతున్నారు.
ఈ యాప్స్ ను ప్లేస్టోర్ నుండి తీసేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులంటున్నారు. ఫైనాన్స్ సంస్థల యాప్స్ ను ఎవరూ నమ్మొద్దని, వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. సైబారాబాద్ లో ఇప్పటి వరకుక 3 కేసులు నమోదయ్యాయి.