పోలీసులు-ఆర్టీసీ కార్మికుల తోపులాటతో ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆర్టీసీ కార్మికులపై లాఠీచార్జీ చేస్తుండటంతో… ఆర్టీసీ కార్మికులు, మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికే గుంపులు గుంపులుగా కార్మికులు, మహిళలు, విద్యార్థి సంఘం నేతలు ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీచార్జీతో కార్మికులు కూడా ఎదురుదాడికి దిగి, రాళ్లు రువ్వుతున్నారు. దాంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగం చేస్తుండటంతో… మరోసారి తెలంగాణ ఉద్యమ సందర్భం గుర్తుకు వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు కార్మికులు, పలు పార్టీల నేతలు.
కట్టమైసమ్మ దేవాలయం నుండి హిమాయత్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అక్కడ లాఠీ చార్జీ కొనసాగుతున్నట్లు సమాచారం.