ఆర్టీసీ కార్మికులు పిలుపునిచ్చిన మిలియన్ మార్చ్ రణరంగాన్ని తలపిస్తోంది. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో లాఠీచార్జ్, రాళ్లు రువ్వుకోవటంతో తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి.
మిలియన్ మార్చ్ సందర్భంగా అక్కడి వాతావరణం, అరెస్ట్‌లను కవర్ చేసేందుకు వచ్చిన మీడియాను వదల్లేదు పోలీసులు. మీడియా అని చెబుతున్నా, చేతిలో మైక్… కెమెరా కనపడుతున్నా దౌర్జన్యానికి దిగారు. లాఠీచార్జ్ చేస్తున్న సమయంలో కావాలనే పోలీసులు దౌర్జన్యం చేయటం, పోలీసుల అరచకాన్ని చూపించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని జర్నలిస్ట్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జర్నలిస్ట్‌లపై కూడా లాఠీచార్జ్ చేయమని ఎవరు ఆదేశించారు అని జర్నలిస్ట్‌లు ప్రశ్నించినా, పోలీసులు వినిపించుకోలేదు.