ఢిల్లీ సరిహద్దులో రైతులు చేపట్టిన ట్రాక్టర్స్ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. దాదాపు 100కి.మీ పైగా మూడు సరిహద్దుల నుండి ర్యాలీ చేయాలని భావించగా, పోలీసులు కూడా అనుమతి ఇచ్చారు. మద్యాహ్నం 12గంటల తర్వాత రైతుల ర్యాలీకి ఎలాంటి ఆంక్షలుండవని పోలీసులు చెబుతున్నారు.
అయితే, ఘాజిపూర్ వద్ద ట్రాక్టర్స్ ర్యాలీ కోసం వెళ్తున్న రైతులు అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగిస్తున్నారన్న నెపంతో లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సింఘూ బార్డర్ నుండి వస్తున్న ర్యాలీ సంజయ్ గాంధీ నగర్ దాటింది.
ఇక రైతుల ర్యాలీని పోలీసులు డ్రోన్ కెమెరాల సహాయంతో పరిశీలిస్తున్నారు. ఈ ర్యాలీలో సంఘవిద్రోహా శక్తులు చేరే అవకాశం ఉందని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ర్యాలీ చేసుకోవాలని పోలీసులు అనుమతిస్తూ 37రకాల షరతులు విధించారు.