ఉస్మానియా మరోసారి పోలీసుల కవాతుతో నిండిపోయింది. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా, విద్యా సంస్థల సెలవుల పొడగింపుపై విద్యార్థి సంఘాలు చలో ప్రగతిభవన్‌కు పిలుపునిచ్చాయి. దీంతో… ఓయూ నుండి విద్యార్థులు బయటకు రాకుండా భారీగా పోలీసు బలగాలు ఓయూను చుట్టుముట్టాయి. ఓయూ రెండు గేట్లను ఇప్పటికే మూసివేయగా, ప్రగతిభవన్ వద్ద కూడా గట్టి పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. దీనిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.