అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయి ఇటీవలే బెయిల్ పై విడుదలైన రాజ్ కుంద్రా కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. రెండు నెలల పాటు జైల్లో ఉన్న కుంద్రా సోమవారమే బెయిల్ పై బయటకొచ్చారు.
ఈ కేసును దర్యాప్తు చేసిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు… రాజ్ కుంద్రా ఫోన్, ల్యాప్ టాప్ ను పరిశీలించగా ఏకంగా 119 బ్లూ ఫిల్మ్స్ బయటపడ్డాయని పేర్కొన్నారు. వీటిని 9కోట్లకు బేరం పెట్టినట్లు తెలిపారు.
ఫిబ్రవరి నెలలో ముంబైలో మాద్ దీవిలోని ఓ బిల్డింగ్ లో పోర్న్ మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు ఫిర్యాదు అందటంతో ముంబై పోలీసులు సోదాలు చేశారు. ఇద్దరు వ్యక్తులు నగ్నంగా పట్టుబడగా, మొత్తం 11మందిని అరెస్ట్ చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయగా హాట్ షాట్స్ యాప్ నిర్వాహకుడు రాజ్ కుంద్రా దీని సూత్రధారి అని తేల్చారు. ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త.