సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో హెడ్‌గార్డ్ వెంకటేశ్వర్లు తన గన్‌తో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తన సొంత వెపన్ ఎకే-47తో కాల్చుకొగా… వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగానే మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. నల్గొండ జిల్లా వలిగొండకు చెందిన వెంకటేశ్వర్లు కొంతకాలంగా ఫాంహౌజ్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
అయితే, వెంకటేశ్వర్లు మద్యం మత్తులో ఉన్నారని, కొంతకాలంగా విధులకు కూడా సరిగ్గా హజరుకావటం లేదని సిద్దిపేట పోలీస్ కమీషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. భార్య విజ్ఙప్తితోనే తిరిగి విధుల్లో చేరారని అన్నారు. అయితే, అక్కడ సూసైడ్ నోట్ ఎమైనా దొరికిందా అనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.